ప్రసాదం తిన్న 500 మందికి అస్వస్థత.. ఆసుపత్రిలో పడకల కొరతతో రోడ్డుపైనే చికిత్స
మతపరమైన కార్యక్రమంలో పంచిన ప్రసాదం తిని (eating prasad) సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు (Food Poisoning). ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని బుల్దానా జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. లోనార్‌లోని సోమతానా గ్రామం (Somthana village)లో వారం రోజులుగా 'హరిణం సప్తా' అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం చివరి రోజు కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ పంచిన ప్రసాదం తిని అస్వస్థతకు గురైనట్లు బుల్దానా (Buldhana) కలెక్టర్ కిరణ్...