రుణమాఫీ కి జగన్ ‘సిద్ధం’!
ఏపీలో విపక్షాలు ఒక్కటవుతున్నాయి. ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. వచ్చేవారం ఎన్డీఏలోకి తెలుగుదేశం చేరుతుందని ప్రచారం జరుగుతోంది. మూడు పార్టీల ఎన్నికల వ్యూహాలు సంయుక్తంగా ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో జగన్ అలర్ట్ అయ్యారు. తన వ్యూహాలను పదును పెడుతున్నారు. సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో సిద్ధం సభలు పూర్తయ్యాయి. ఆదివారం రాప్తాడులో సభ జరగనుంది. ఇదే వేదికపై జగన్ కీలక ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది. రాప్తాడు సభలో ఎన్నికల మ్యానిఫెస్టో...