ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ సీట్లకు నోటిఫికేషన్
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద, వెనుక బడిన వర్గాల విద్యార్దులకు కేటాయించాల్సి ఉంది. దీని ప్రకారం ఏపీలో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ సీట్ల కేటాయింపు కోసం అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఉచిత సీట్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇతర వివరాలను అందుబాటులో ఉంచింది. ఏపీలోని ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్లు పొందేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. ఈ నెల 23...