అన్నీ ప్రీపెయిడ్‌ మీటర్లే..

విద్యుత్‌ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్‌ మీటర్ల నెట్‌వర్క్‌లోకి తేవాలని కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్ణయించింది. రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎ్‌సఎస్‌) కింద దేశవ్యాప్తంగా 19.79 కోట్ల కనెక్షన్లు, 52.19లక్షల దాకా పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్‌), 1.88లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్‌/స్మార్ట్‌మీటర్లు బిగించాలనుకుంటోంది. మీటర్ల బిగింపు/అమలు ప్రక్రియపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను జారీ చేసింది. ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంత మేర కరెంట్‌ను వాడుతున్నారో ఆ మేరకు అడ్వాన్స్‌గా డిస్కమ్‌లకు చెల్లించి రీచార్జ్‌ చేసుకోవాలి. రీచార్జ్‌ మొత్తం అయిపోగానే వినియోగదారు మొబైల్‌కు మూడుసార్లు ఎస్‌ఎంఎస్‌ ద్వారా...