ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం క్లారిటీ..!

ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్లూ వ్యాప్తి కారణంగా పలు చోట్ల కోళ్లు మృత్యువాత పడటంతో ఈ ఆందోళన మరింత పెరిగింది. ఇతర జిల్లాలకూ ఫ్లూ వ్యాప్తి చెందిందన్న వార్తలు రైతులతో పాటు చికెన్ వినియోగదారుల్ని సైతం కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వార్తలపై స్పందించింది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తాజా పరిస్ధితిపై ప్రకటన విడుదల చేసింది. ఇందులో నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం చాటగొట్ల, కోవూరు మండలం గుబ్బలదిబ్బ గ్రామాల్లో...