జగన్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేదు. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకూ మార్చి మూడో వారంలో షెడ్యూల్ విడుదల కావడం దాదాపుగా ఖాయమైంది. గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అటు ప్రచార వేడీ పెరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, దాని మిత్రపక్షం జనసేన.. ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆరు విడతల్లో పలు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులనూ ఖరారు చేసింది. టీడీపీ-జనసేన ఇంకా అభ్యర్థుల ఖరారుపై మల్లగుల్లాలు...