వచ్చే పాతికేళ్లలో సుమారు 100 కోట్ల మందికి వచ్చే వ్యాధి

ఇప్పటికే ఎన్నో రోగాలు పుట్టుకొచ్చి మానవాళిని ఇబ్బంది పెడుతున్నాయి. మూడేళ్ల పాటు కరోనా చేసిన అల్లోకల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కొత్త అధ్యయనంలో మరొక విషయం తేలింది. వచ్చే పాతికేళ్లలో అంటే 2050 కల్లా 100 కోట్ల మందికి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనం వివరాలను రుమటాలజీ జర్నల్లో ప్రచురించారు. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 59 కోట్ల మంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2050 కల్లా రెట్టింపు అవుతుంది. 100 కోట్లను దాటే...