దేనికి సిద్ధం.. జైలుకి జగన్ సిద్ధంగా ఉన్నారా?

పదే పదే సిద్ధం అంటున్నారు సీఎం జగన్.. దేనికి సిద్ధం.. జైలుకి జగన్ సిద్ధంగా ఉన్నారా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే జగన్ సిద్ధం అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ నేత నారా లోకేశ్. పలాస శంఖారావంలో నారా లోకేశ్ మాట్లాడారు. ”జగన్ పదే పదే పేదవాడినని చెబుతున్నారు. సొంత చానల్, సొంత సిమెంట్ ప్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? ప్రజలు ఆలోచించాలి. సూపర్ సిక్స్ అని పవన్, చంద్రబాబు సంయుక్తంగా ఓ మ్యానిఫెస్టో రూపొందించాం. రూ.15వేలు పాఠశాల వెళ్లే విద్యార్ధికి, రూ.20వేలు రైతుకు అందజేస్తాం....