సముద్రంలో కొట్టుకొస్తున్న మృతదేహాలు తీరంలో భయం.. భయం..
సందర్శకులతో సందడిగా ఉండాల్సిన బీచ్‌లలో వరుసగా మృతదేహాలు కొట్టుకొస్తుండటంతో స్థానికులు, టూరిస్టులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బాపట్లజిల్లా వాడరేవు, రామాపురం సముద్రతీరాల్లో రెండు రోజుల వ్యవధిలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి.. కొట్టుకొచ్చాయా..? లేక కొట్టి చంపేశారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. మృతదేహాలపై గాయాలు ఉండటం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో మూడు రోజుల క్రితం ఓ గుర్తు తెలియని...