చంద్రబాబుకు మళ్లీ ఉచ్చు బిగిస్తోన్న జగన్?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య వార్ ముదురుతోంది. ముఖ్యంగా విపక్షాల దూకుడును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం జగన్ మరోసారి కొరడా ఝళిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు జరుపుతున్న సమయంలోనే రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబుకు తాజాగా ముందస్తు బెయిల్ లభించిన కేసుల్లో ఒకటైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విజయవాడ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. చంద్రబాబు ఢిల్లీలో...