డ్రైవర్ నిర్లక్ష్యంతో బాలుడు మృతి
ఓ డీసీఎం వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న బాలుడిని ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ అల్వాల్ ఇందిరా గాంధీ చౌరస్తా సమీపంలో గల రిలయన్స్ స్మార్ట్ కు సరుకుల లోడుతో డీసీఎం వ్యాన్ వచ్చి ఆగింది. సరుకులు దింపడానికి దుకాణానికి ఎదురుగా డీసీఎం వాహనం నిలిపిన డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయక పోవడంతో అదుపు తప్పిన వాహనం రోడ్డుపైకి వచ్చి తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్లుతున్న తల్లి కొడుకును...