వీధి కుక్క కోసం.. భార్యను చంపుకున్నాడు
నేరం చేసి దాని నుంచి ఎలా తప్పించుకోవాలా..! అనే ఆలోచించే సమాజం మనది. అంతకూ కాదంటే చేసిన నేరాన్ని పక్కవారిపై నెట్టేయడమో లేదా ప్రమాదకరంగా చిత్రీకరించడమో చేస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం చేయని తప్పును తనపై వేసుకున్నాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకున్నాడు. చేయని తప్పుకు ఆయన అలా ఎందుకు చేశాడు అనేది తెలియాలంటే కింది కథనం చదవాల్సిందే.. గుజరాత్‌లోని నర్మదా జిల్లాకు చెందిన పరేష్ దోషి(55) తన భార్య అమితతో కలిసి ఇటీవల అంబాజీ ఆలయానికి...