షుగరు పేషెంట్లకు గుడ్ న్యూస్..
శరీరానికి ఎన్ని వ్యాధులు వచ్చినా నయం చేయడానికి మందులున్నాయి కానీ షుగర్ వ్యాధి వస్తే మాత్రం శాశ్వతంగా తగ్గడానికి మందుల్లేవు. ఎప్పుడూ నియంత్రణలోనే ఉంచుకుంటుండాలి. అలా చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు షుగరు రోగులకు ప్రత్యేకమైన చాక్లెట్ ను తయారు చేశారు. శరీరంలో ఇన్సులిన్ అవసరాలను ఇది తీరుస్తుంది. వీటిని యూఐటీ ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ లు తయారు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్లమంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. అందులోను భారతదేశంలో రోజురోజుకు వీరి సంఖ్య...