జగన్, చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ

ఏపీ ఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై సభలో చర్చించాలని కోరారు. హామీల అమలుకు ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపాలని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు. వాటిని విస్మరించి, నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాన్ని ఇంకా మోసం...