అంతరిక్షంలోకి.. ‘జీరో’
గోబర్ గ్యాస్ తెలుసుకదా.. అదేనండి వంట వండటానికి ఉపయోగిస్తుంటాం. దాంతో వంట చేసుకోవటం పాత విషయమే కానీ తాజాగా గోబర్‌గ్యాస్‌తో రాకెట్లనూ నడపొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. జపాన్‌కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ ఏకంగా గోబర్‌గ్యాస్‌తో పనిచేసే రాకెట్ ఇంజిన్‌ను రూపొందించింది. రాకెట్ ఇంజిన్లలో రకరకాల ఇంధనాలు వాడుతుంటారు. చాలావరకు బాగా శుద్ధి చేసిన కిరోసిన్‌ను ఉపయోగిస్తారు. దీనికి భిన్నంగా జపాన్‌కు చెందిన ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ అనే అంకుర సంస్థ పర్యావరణహిత రాకెట్ ఇంజిన్‌ను రూపొందించింది....