గూగుల్ మ్యాప్ సహాయంతో దొంగను పట్టుకున్న ఓ కుర్రాడు
గూగుల్ మ్యాప్ సహాయంతో తెలియని ప్రదేశానికి వెళ్లడం సహజం. కానీ ఓ కుర్రాడు తన తండ్రి వద్ద ఉన్న ఫోన్ని, బ్యాగ్ని కొట్టేసిన దొంగను పట్టుకున్నాడు. తాను ఏవిధంగా దొంగను పట్టుకున్నది ఆ కుర్రాడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దొంగను పట్టుకున్న యువకుడి పేరు పి. రాజ్ భగత్. 'మా నాన్న తిరుచ్చికి వెళ్లడానికి తమిళనాడులోని నాగర్ కోయిల్ జంక్షన్ నుంచి...