ఒక్క ప్లాట్ రూ.200 కోట్లు.. భారీగా ఎగబడ్డ జనం
కరోనా మహమ్మారి తరువాత రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందింది. గత కొంతకాలం నుంచి ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. ఇండియాలోనే ఇలా ఉంటే.. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో రియల్ ఎస్టేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల USAలో ప్లాట్ ఏకంగా రూ.200 కోట్లకు పలికినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని చాలామంది ధనవంతులు ప్లోరిడాలోని మయామీ బీచ్ దగ్గర ఇల్లు కట్టుకోవాలని కలలు కంటారు....