బొమ్మ బొరుసు ఆట పేరుతో దారి దోపిడీ
లిఫ్ట్ ఇస్తామని చెప్పి వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని బొమ్మ బొరుసు ఆట పేరుతో వారి వద్ద ఉన్న సుమారు రూ.2.55 లక్షల సొత్తును దుండగులు దారిదోపిడీ చేసిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. దొంగతనాలకు మరో భాష్యం చెప్పే విధంగా దుండగులు ఈ చోరీ చేయడం విశేషం. బొమ్మ బొరుసు ఆట పేరుతో ముందు వంద రూపాయలు వృద్ధ దంపతులకు వచ్చాయని ఆశ చూపి ఆ తర్వాత వారి దగ్గర ఉన్న సొత్తు మొత్తాన్ని కొల్లగొట్టారు. బాధిత వృద్ధ దంపతులు పోలీసులకు ఇచ్చిన...