కేజ్రీవాల్‌ ఇంటికెళ్లిన ఢిల్లీ పోలీసులు.. సిఎంని అరెస్టు చేస్తారా…?

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వాన్ని బెజిపి టార్గెట్‌ చేస్తోంది. ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర ప్రభుత్వం ఆప్‌ మంత్రులైన సత్యేందర్‌ జైన్‌, మనీష్‌ సిసోడియాను అరెస్టు చేసి జైలులో ఉంచింది. ఇప్పుడు ఆ రాష్ట్ర సిఎంనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇడి ద్వారా సమన్లు జారీ చేస్తోంది. మద్యం కుంభకోణం కేసులో పలుసార్లు కేజ్రీవాల్‌కి ఇడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇడి విచారణకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్‌ నిరాకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు శనివారం ఉదయం ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కి...