ఆర్బీఐ ఆంక్షలపై స్పందించిన పేటీఎం సీఈవో

ఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం(Paytm) వినియోగదారులు ఆందోళన చెందారు. చివరికి కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ కస్టమర్లను కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో(X) ఓ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యాప్ కార్యకలాపాలను కొనసాగిస్తుందని వివరించారు. అన్ని వేళలా తమకు అండగా ఉంటున్నందుకు కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. "ఆర్బీఐ ఆంక్షల తరువాత పేటీఎంకు అన్ని వర్గాల...