మూడు రోజుల మచ్చటేనా ?..
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అప్పటి నుంచి ఆర్టీసీ చరిత్రలోనే అత్యధికంగా ఆక్యుపెన్సీ పెరిగింది. బస్సులు రద్దీగా ఉన్నాయి. అయితే వారిలో అత్యధికులు మహిళలే. దీంతో పురుషులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సుల్లో మహిళలే ఎక్కువగా ఉండడంతో పురుషులకు సీట్లు లభించడం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలన్న డిమాండ్ పెరిగింది. అవసరమైతే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతామని మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సందర్భంగా ఆర్టీసీ ఎండీ...