29 రూపాయలకే కేజీ బియ్యం..!

దేశంలో బియ్యం కొరత ఏర్పడి, ధరలు ఆకాశాన్నంటడంతో ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరిట కిలో బియ్యాన్ని కేవలం రూ.29లకే విక్రయించాలని నిర్ణయించింది. ఈ సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ (ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే గోధుమపిండి, పప్పుధాన్యాలను భారత్ ఆటా,...