పదవ తరగతిలో 10 పేపర్లు, 12 వ తరగతిలో 6 పేపర్లు!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల 10, 12 తరగతుల అకడమిక్ ఫ్రేమ్ వర్క్ లో గణనీయమైన మార్పులను ప్రతిపాదించింది. సీబీఎస్ఈ 10వ తరగతిలో ప్రస్తుతం విద్యార్థులు రెండు లాంగ్వేజెస్ ను చదువుతున్నారు. ఇకపై వారు 10వ తరగతిలో మూడు భాషలను నేర్చుకోవాలని, అందులో కనీసం రెండు భారతీయ భాషలు అయి ఉండాలని సీబీఎస్ఈ ప్రతిపాదిస్తోంది. 10 సబ్జెక్టుల్లో పాస్ కావాలి.. అలాగే, ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు ఐదు సబ్జెక్టుల్లో పాస్ కావాల్సి ఉంది. ఇకపై వారు 10 సబ్జెక్టుల్లో...