పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీ

హైదరాబాద్ :జనవరి 31హైదరాబాద్‌ సీపీ కొత్త‌కోట‌ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని బుధవారం బదిలీ చేశారు.పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని మొత్తం సిబ్బందిని ఒకే సారి బదిలీ చేశారు. పీఎస్‌లోని మొత్తం 86 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు బుధవారం జారీ చేశారు. ఇన్స్‌పెక్టర్ నుంచి హోంగార్డు వరకు అందరిని ఒకే సారి బదిలీ చేయడం సంచలనంగా మారింది.తొలిసారి పీఎస్ సిబ్బంది మొత్తాన్ని సీపీ బదిలీ చేశారు.కాగా, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు వివాదంలో ఇప్పటికే పలు...