పూడ్చిన శవంతో ..వాటే ఐడియా గురూ..!
కొంత మంది చావు తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. మోసం చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి తనకొచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భారీగా నాటకానికి తెర లేపాడు. తను చనిపోయినట్లుగా నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని భావించాడు. అనుకున్నదే తడువుగా ప్లాన్ వేశాడు. ఓ మృతదేహాన్ని తీసుకొచ్చి తను చనిపోయినట్లుగా నమ్మిచాడు. అతను చనిపోయినట్లు కట్టుకున్న భార్యతో సహా ఊరంతా నమ్మారు. కానీ పోలీసులు మాత్రం అతని నాటకాన్ని కనిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన కేతమళ్ల పూసయ్య...