నారా భువనేశ్వరికి తృటిలో తప్పిన విమాన ప్రమాదం
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వ రికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలు దేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేయగా.. కొద్దిసేపు అలాగే గాల్లో చక్కర్లు కొట్టింది. కొద్దిసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు....