సిలిండర్ లో గ్యాస్ బదులు నీళ్లు.!!

వరంగల్‌లోని ఓ గ్యాస్‌ వినియోగదారుడికి వింత అనుభవం ఎదురైంది. తమ గ్యాస్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ బదులు నీరు వస్తుందని లబోదిబోమన్నాడు. గ్యాస్‌కు బదులు నీళ్లు బయటికి రావడంత ఇదేం విడ్డూరం అంటూ విస్తుపోయాడు. ఈ వింత ఘటన ఆనోటా ఈనోటా పాకి స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకెళ్తే.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆకుల సత్యం అనే వినియోగదారుడు ఎప్పటి మాదిరిగానే గ్యాస్‌ బుక్‌ చేసుకున్నాడు. వారం క్రితం ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ నుంచి సిలిండర్‌ సరఫరా అయ్యింది. దీంతో...