బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు:ముగ్గురి దుర్మరణం
కర్ణాటక , జనవరి 29 : కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలోని ఒక బాణసంచా తయారీ కర్మాగారంలో ఆదివారం అర్ధ రాత్రి ఈ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. . ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. సమీపప్రాంతాల ప్రజలు తీవ్ర...