హీరో వెంకటేష్, రానాలపై కేసు నమోదు
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని...