మహిళ పీజీ కాలేజీ హాస్టల్ బాత్రూంలోకి చొరబడ్డ దుండగులు: విద్యార్థుల ధర్నా
హైదరాబాద్: జనవరి 27 పీజీ లేడీస్ హాస్టల్ లోకి ఇద్దరు వ్యక్తులు వెళ్లడం కలకలం రేపింది. సికింద్రాబాద్ బేగంపేటలోని మహిళా పీజీ కాలేజీ హాస్టల్ బాత్రూంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు దండుగులు చొరబడ్డారు.ఇది గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు.విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. తమకు రక్షణ లేదంటూ విద్యార్థిను లు కళాశాల గేట్లు మూసేసి ఆందోళన చేపట్టారు.దీంతో పోలీసులు అక్కడ చేరుకొని వారిని వారించే ప్రయత్నం చేశారు. విద్యార్థునులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం...