మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష!
(కేరళ): మైనర్ బాలికపై సొంత తండ్రే దారుణానికి ఒడిగట్టిన ఉదంతమిది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. అలాంటి కీచక తండ్రికి (42) కేరళ కోర్టు పెద్ద శిక్ష విధించింది. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన నేరానికి గానూ 150 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఈ మేరకు పెరింతల్మన్న ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు -2 తాజాగా తీర్పు వెలువరించింది. మలప్పురం జిల్లాలోని కలికావు పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో ఈ దారుణం జరిగింది. దోషికి ముగ్గురు భార్యలు కాగా.. అందులో...