మది నిండుగా… జెండా పండుగ…<br>మురిసిన మూడు రంగుల జెండా
ఊరూరా రెపరేపలాడిన జాతీయ జెండా.ఘనంగా గణతంత్ర వేడుకలు...నల్లబెల్లి, జనవరి 26 : మండలంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో వేడుకలను చేపట్టారు. మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగరవేసి, వందన సమర్పణ చేశారు. తాహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి రాజేష్ ,ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, పోలీస్ స్టేషన్లో ఎస్సై నైనాల. నగేష్, మథర్ తెరిస్సా మండల సమాఖ్య కార్యాలయంలో ఎం పి ఓ సునీత, పీఏసీఎస్...