చంద్రబాబు తీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి.. పొత్తుపై ఎఫెక్ట్..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఐతే ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన.. టీడీపీ-జనసేన కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మండపేట, అరకు సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఏకపక్షంగా ప్రకటించడాన్ని.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా తప్పుబట్టారు. తాము కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నామని.. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు పవన్ కల్యాణ్. జనసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్....