కేటీఆర్… బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్: సీతక్క

రాజన్న జిల్లా: జనవరి 25బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు మైండ్‌ బ్లాకైందని విమర్శలు గుప్పించారు.తమ అహంకారమే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైందని దుయ్య బట్టారు. అధికారం లేకుండా కేటీఆర్‌ ఉండలేకపోతు న్నారని, అందుకే విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని గురువారం మంత్రి సీతక్క దర్శించు కున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లు గడీల పాలన చేసిందని విమర్శించారు.ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదని...