రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య

ఉత్తర ప్రదేశ్: జనవరి 21 శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య‌లో ప‌లు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు భ‌క్తులు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా సోమ‌వారం అయోధ్య‌ ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకోనుంది.రేపు సాయంత్రం పది లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించ నున్నట్లు రామజన్మభూమి ట్రస్టు తెలిపింది. అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే ఉపయోగించ నున్నట్లు పేర్కొంది. రామ మందిరం సహా రామ్‌ కీ పైడీ, కనక్‌ భవన్‌, గుప్తర్‌ ఘాట్‌, సరయు ఘాట్‌, లతా మంగేష్కర్‌ చౌక్‌, మనిరామ్‌ దాస్‌ చవానీ వంటి...