రాచకొండ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్‌బాబు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. సైబర్‌ క్రైం స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నందీశ్వర్‌ రెడ్డిని నాచారం పోలీస్‌స్టేషన్‌కు, కుషాయి గూడ ట్రాఫిక్‌ 2లో విధులు నిర్వహిస్తున్న వై.రవీందర్‌ను చర్లపల్లికి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.ఎలక్షన్‌ రెడ్డిని ఉప్పల్‌కు, సైబర్‌ క్రైంలో పనిచేస్తున్న బి.రాజును పోచారం ఐటీ కారిడార్‌ స్టేషన్‌కు, భువనగిరి రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సత్యనా రాయణను మల్కాజిగిరికి బదిలీ చేశారు. ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.గోవిందరెడ్డిని మేడిపల్లికి, పోచారం ఐటీ...