తబుక్ లో సాటా సరదాల సంక్రాంతి సంబురాలు
సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) – నార్త్ రీజియన్ తబుక్ లో నిర్వహించిన భోగి మరియు సంక్రాంతి “సరదాల సంక్రాంతి” కార్యక్రమం సభికులకు ఉత్తేజం ఉల్లాసం కలిగించింది. గురువారం జనవరి 11 న రాత్రి 8 గంటలు మొదలైన ఈ సంబురాలు శుక్రవారం జనవరి 12 న సాయంత్రం 6 వరకు పండగ వాతావరణం తో అనేకమైన సాంప్రదాయ కార్యక్రమాలతో, ఆట పాటలతో మరియు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులందరినీ ఎంతగానో అలరించింది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల...