AP News : బొలెరో వాహనం ఢీకొని ఎద్దులు మృతి
అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా విడపనకల్ మండలం సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.విడపనకల్ నుండి ఎద్దు లబండిపై పొలాల్లోకి వెళ్తుండగా వెనక నుండి గొర్రెల లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు ఎద్దుకు అక్కడికక్కడే మృతి చెందాయి.ఎద్దులబండిపై వెళ్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొలెరో వాహనంలో దొంగలించిన గొర్రెలు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను అనంత పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు...