కొనసాగుతున్న ఆధార్ అప్డేట్ కష్టాలు… పట్టింపులేని అధికారులు…

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇప్పుడు ఎక్కడ కూడా ఆధార్ కార్డ్ లేకుండా పని కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ఆధార్ కార్డ్ కు అనుసంధానం చేస్తున్నాయి. అయితే ఈ పథకాలు పొందాడని ఆధార్ అప్డేట్ తప్పని సరి చేయడం తో ప్రజల కష్టాలు వర్ణనాతీతం... చంటి పిల్లలతో మహిళలు ఉదయం నుండి ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా కేంద్రాలను రన్ చేస్తున్నారు. దీనికి తోడు సమయ పాలన కూడా ఉండడం లేదు....