ప్రజాపాలన దరఖాస్తులు ఏలాంటి పొరపాట్లు లేకుండా ఆన్లైన్ నమోదు చేయండి : జిల్లా కలెక్టర్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాదు : ప్రజా పాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో అందిన దరఖాస్తుల...