అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలనలో అభయహస్తం మొదటి రోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన దరఖాస్తు కేంద్రాలను, జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఉదయం తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలిపుర ప్రభుత్వ పాఠశాల నందు, మహాలక్ష్మి వాడ ప్రభుత్వ పాఠశాల నందు, తాంసి మండలం వడ్డాడి గ్రామం గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటు చేయబడిన దరఖాస్తు కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించి ప్రజలతో, సిబ్బందితో...