పురుషుల కోసం ప్రత్యేక బస్సులు..!?

హైదరాబాద్:డిసెంబర్ 27మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తోంది.ఈనెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా.. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కిడికైనా ఫ్రీగా ప్రయాణించొచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జీరో టికెట్‌తో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.దీంతో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సుల్లో అనుహ్యంగా రద్దీ పెరిగింది. గతంలో నిత్యం మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య...