టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన ‘నిరుద్యోగ మార్చ్’తో కాషాయమమైన ఓరుగల్లు
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన 'నిరుద్యోగ మార్చ్'తో ఓరుగల్లు కాషాయమమైంది. దీనికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు సహా ముఖ్య నేతలు నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కూడలి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం సహా నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ...