టిఎస్పీఎసి పేపర్ లీకేజీ…. ఈడీ ఎంట్రీ …

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగింది. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు వీరిద్దరి వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. మనీలాండరింగ్‌ జరిగినట్లు అంచనా వేస్తోంది. సిట్‌ అధికారులు సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మిపై ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆమెతో పాటు టీఎస్‌పీఎస్సీకి...