యువత రక్తదానానికి ముందుకు రావాలి : జిల్లా కలెక్టర్
రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : రక్తదానం వలన మరొకరికి పునర్జన్మను ప్రసాదించవచ్చని, ఆరోగ్య ఆదిలాబాదుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. శుక్రవారం రిమ్స్ ఆడిటోరియంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్, అల్ ఇండియా ఫిజిషియన్స్ అసోసియేషన్, రిమ్స్ జూడాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిభిరాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, 18 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతులు ఎవరైనా...