ప్రకృతి ప్రేమికుడు జక్కుల వెంకటేష్
కొంతకాలం క్రితం గ్రామాల్లో, పట్టణాల్లో పక్షుల కిలకిల రాగాలు సందడి చేసేవి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి అరుపులు కాదు కదా, పక్షులను చూడటమే గగనంగా మారింది. అందుకు ముఖ్య కారణం, పక్షులకు సరైన గూళ్లు నిర్మించుకోవడానికి ఆవాసాలు లేకపోవడం, నీరు ఆహారం దొరక్క పోవడమే. ఈ సంగతి గుర్తించిన అదిలాబాద్ జిల్లా బోథ్ గ్రామానికి చెందిన జక్కుల వెంకటేష్ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్థు పక్షులను రక్షించాలని ఉద్యమం మొదలు పెట్టాడు. అంతేకాదు చెట్లపై పక్షుల కోసం ప్రత్యేకంగా గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. బర్డ్...