అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులందరికి అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు :సూర్యాపేట జిల్లా గిరిజన చైతన్య యాత్ర పాలకవీడు మండలంలోని శూన్యపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు.అనంతరం ప్రారంభ సభను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అడవి నీ నమ్ముకుని బ్రతుకుతున్న గిరిజనులు అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని వారికి పట్టాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేసిన ఫలితంగా 2006లో వామపక్ష పార్టీలు పార్లమెంటులో...