సిలెండర్ ధర పెంపును నిరసిస్తూ ఇచ్చోడలో భారీ ధర్నా

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :సిలెండర్ ధరను పెంచిన కేంద్రములోని బి.జె.పి వైఖరిని నిరసిస్తూ ఇచ్చోడ మండల కేంద్రములో బి.ఆర్.ఎస్ మండల శాఖ ఆధ్వర్యములో భారీ రాస్తారోఖో నిర్వహించారు,ఈ నిరసన కార్యక్రమము సందర్బంగా 30 నిమిషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్బంగా మాజీ మండల కన్వీనర్ మెరాజ్ హమ్మద్ మాట్లాడుతూ అధిష్టాన ఆదేశానుసారం బోథ్ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు నాయకత్వ సూచనల మేరకు ఈ భారీ రాస్తారోఖో నిర్వహించడం జరిగిందని అన్నారు. పేద కుటుంబాలకు గుదిబండల తయారైన సిలెండర్ ధర పెంపుని...