శివనామ స్మరణతో మార్మోగిన పుర శైవ క్షేత్రాలు

రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ (ఫిబ్రవరి 18):  రామకృష్ణాపూర్ లోని స్థానిక కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న శివాలయం, అంగడి బజార్ ఏరియాలోని నూతన రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని తెల్లవారుజామున బిల్వార్చన,రుద్రాభిషేకాలు వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఘనంగా నిర్వహించారు.శివపార్వతల కళ్యాణాన్ని ఆలయ అర్చకులు అంబా ప్రసాద్,దేవోజు రాజశేఖర నంద స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా,భక్తులు కనుల పండుగగా తిలకించారు.బూర్ల పవన్ కుమార్ (శ్రీ రాగ మయూరి) భజన మండలిచే భక్తి పాటలు ఆలపించగా శివనామస్మరణతో ఆద్యంతం భక్తులు జాగారణ చేశారు.ఈ...