పాత్రికేయులపై దాడిని ఖండించిన టియుడబ్ల్యూజే

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ పాత్రికేయుని ఇంట్లో జరిగిన విందులో సోమవారం రాత్రి ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి, మరో హోంగార్డు  విజయ్ ఇద్దరు జర్నలిస్టులపై భౌతిక దాడికి  దిగడం పట్ల టియుడబ్ల్యూజే (హెచ్ 143 )తీవ్రంగా ఖండించింది. ఇచ్చోడుకు చెందిన కమురుద్దీన్ మరియు కొత్తూరు లక్ష్మన్ లపై ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి భౌతిక దాడికి దిగడంతో వారికి గాయాలయ్యాయి. మంగళవారం బోథ్ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు జిల్లా ఎస్పీని కలిసి ఎంపీపీ ఆగడాల గురించి భౌతిక దాడుల గురించి వివరించారు....